బ్లాగాయనమః
ఈ మధ్య మా అబ్బాయి సెమెస్టర్ బ్రేక్ కి ఇంటి కోచ్చాడు. గడ్డాలోచ్చినా వాడి అడ్డాల నాటి కొన్ని చమత్కారమయిన సంఘటనలు గుర్తుకొస్తేనే నవ్వు తెప్పిస్తాయి . అవన్నీ మీ అందరితో కలిసి నెమరు వేసుకోవాలనుకున్నా. చిత్తగించండి.
ఈ మధ్య మా అబ్బాయి సెమెస్టర్ బ్రేక్ కి ఇంటి కోచ్చాడు. గడ్డాలోచ్చినా వాడి అడ్డాల నాటి కొన్ని చమత్కారమయిన సంఘటనలు గుర్తుకొస్తేనే నవ్వు తెప్పిస్తాయి . అవన్నీ మీ అందరితో కలిసి నెమరు వేసుకోవాలనుకున్నా. చిత్తగించండి.
పసిపిల్లలను అస్తమానం
ఇబ్బంది పెట్టే జలుబుకి మా వాడు
చీటికీ మాటికీ దొరికిపోయేవాడు. వంటింటి, పెరటి చిట్కా వైద్యాలన్నీ ప్రయత్నించాక
కూడా, డాక్టరు దగ్గరికి షికారు తప్పేది కాదు ‘లంగ్స్ చెక్’ చేయించడానికి. డాక్టరు స్టెతెస్కోప్ ఛాతీ -వీపు మీద అదిమి , ఊపిరి దీర్ఘంగా
తీసుకోమనడం వాడికి అలవాటయిన చర్యగా మారి ఇంట్లో కూడా డాక్టర్ ఆటలు సాగించే వాడు. దాంతో మావాడికి రెండేళ్ళ వయసులో డాక్టర్ సెట్
కొన్నాం. అందులోని పరికరాలన్నీ చాలా తీక్షణంగా పరిశీలించి, ఒక వస్తువు తో నా దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు ‘అమ్మా! లంగుచెక్, లంగుచెక్’ అనుకుంటూ... అది వాడు ‘స్టెతెస్కోప్’ కు ఇచ్చి న
నామధేయం అని నాకు అర్ధం అవ్వడానికి కాసేపు
పట్టింది. ఇప్పటికీ ‘స్టెతెస్కోప్’ కంటే ‘లంగుచెక్’ ఆ పరికరానికి మరింత
సరయిన పే రనిపిస్తుంది నాకు.
ఓసారి మా కాలనీ లో ఒకరు వాళ్ల అబ్బాయి
పెళ్లి సొంత వూరులో చేసుకుని, ఈ వూరి లో
వాళ్ల ఇంటి డాబా మీద రిసె ప్షన్ ఏర్పాటు చేసి
మమ్మల్ని విందుకి ఆహ్వానించారు. నేను,
శ్రీవారు, మా వాడు ఆ సాయంత్రం రెడీ అయి
వాళ్ళ ఇల్లు చేరాము. అప్పటి దాకా ఉత్సాహంగా వున్న ఐదేళ్ళ మా సుపుత్రుడు మొహం
చిట్లించి ‘అమ్మా ! పెళ్లి అన్నావ్ ? ఇక్కడికోచ్చామేంటి? హోటల్ కి వెళ్ళాలి కదా?’ అని ఒకటే గొడవ.
ఎవ్వరూ వినకుండా సర్ది చెప్తూంటే ఇంకొంచం గట్టిగా
‘ఇంట్లో మేడమీద రిసెప్షన్ ఎవరైనా చేసుకుంటారా? హోటల్ లో చేసుకోవాలి గానీ’ అంటూ ఏడుపు లంఘించాడు. మాకు బాగా తెలిసిన ఒక పెద్దావిడ ఇదంతా గమనించి ‘ ఏరా! హోటల్ లో పెళ్లి కావాలి రా నీకు? వేలెడు లేవు,
ఏది? రా! ఈ డాబా మీద ఈ రోజు నీకు పెళ్లి చేసేస్తాను’ అని కొంచం మొరటుగా
ముద్దు చేయబోతే మావాడి ఆరున్నోక్కరాగం తారాస్థాయికి చేరింది. మొత్తానికి విందు
చేయకుండా మేము అక్కడి నుంచి మర్యాద కాపాడుకోవడానికి నిష్క్రమించ వలసి వచ్చింది.
ఓ సారి మా అత్తగారికి మాటీలు కొనడానికి బంగారం
కొట్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నీలి రంగు ముఖ్మల్ గుడ్డమీద రక రకాల మాటీలు
సర్ది చూప సాగాడు సేల్స్ మాన్. ఉన్నట్టుండి మూడేళ్ళ మావాడు ‘ఎవిటివీ ?
శమంతకమణిల్లా మెరిసిపోతున్నాయి అని ఒక్క అరుపుతో బిగ్గరగా ఆశ్చర్యం వెలిబుచ్చాడు. ఆ సమయానికి దుకాణంలో వున్న అందరూ ఎవడ్రా వీడు? అన్నట్లు తిరిగి బుడతడిని చూడడమే ! లేక్కలేనన్ని కధలు
చెప్పించుకోవడమే కాకుండా సమయానుసారంగా గుర్తు తెచ్చుకున్నందుకు ఆశ్చర్యపోవడం మా
వంతయ్యింది.
మావాడిని ఆట పట్టించటానికి వాడి మావ
అంటే మా తమ్ముడు , కొత్త బట్టలకి వుండే ‘రేట్ స్టిక్కర్ ‘ ఊడ దీసీ చిన్నవాడి
జబ్బకి అంటించాడు. కంప్యూటర్ లో గేమ్ ఆడుతూవున్నా, వెంటనే దాన్ని పీకేసాడు మావాడు. ఇలా రెండు మూడు సార్లు జరిగాక వాళ్ల మావని గట్టిగా గదమాయిస్తూ ‘ఈ బాబుని ఏ షాపు లో కొన్నారూ ? అని
అడుగుతారు ఈ స్టిక్కర్ పెట్టుకుంటే , ఛీ! నాకు వద్దు !’ అన్నాడు అవమానంగా. అంతే ! మళ్ళీ మళ్ళీ వాడి
చేత అదే డైలాగ్ చెప్పించడం మావ కి సంబరం
అయ్యింది.
ఆరేళ్ళ వయసులో సూట్ వేసుకుని మా బంధువుల
పెళ్లి రిసెప్షన్ లో మావాడు పెళ్ళికొడుకు పక్కన స్టేజెక్కి ఫోజుగా నిలబడ్డాడు. అతిథులు
వధూవరులని ఆశీర్వదించి ‘గిఫ్ట్ ‘ అందించాక, వీడు ఆ గిఫ్ట్ పెళ్లి
కొడుకు వద్దనుంచి అందుకుని వెనుక నున్న నాకు అందిస్తూ చాలా బాధ్యత గా ఫీల్ అవుతూ
ఎంజాయ్ చేస్తున్న తరుణంలో, ఒక పెద్దాయన కొంచం సుమారుగా పెద్ద సైజు గిఫ్ట్
అందించాడు. మా పుత్ర రత్నం దాని మీద చెయ్యి వేసి ‘ ఇది గారంటీగా ఫోటో
ఫ్రేమే!’ అన్నాడు గట్టిగా నావైపు తిరిగి. ష్
! ష్! అని నేవారిం చబోతే ‘అవునమ్మా ! కావాలంటే ముట్టుకుని చూడు?’ అని
రెట్టించాడు. ఆ పెద్దాయన తెల్ల మొహం వేసి (ఎందుకంటే అది ఫోటో
ఫ్రమే ట మరి), చేసేదిలేక మావాడిని ముద్దులాడి వధూవరుల మీద అక్షింతలు వేయడం మరచిమరీ
స్టేజ్ దిగాడు.
ఐదారేళ్ళ వయసులో వాడికి ఇంటికి వచ్చి
శాస్త్రీయ సంగీతం నేర్పించే టీచరుగారు ఓ రోజు పడీ పడీ నవ్వడం గమనించి పాఠం
జరుగుతున్న గదిలోకి వెళ్ళాన్నేను.
జయదేవుని అష్టపది నేర్పుతున్నారామె.
సాహిత్యంలో ‘గోకుల బృందా వన సంచారం’ అని వచ్చినప్పుడు ‘టీచర్! గోకుల అంటే ఇదేనా? ‘ అంటూ తాళం వేయడం మానేసి తోడ గో కుతూ అడిగాడట మా చిట్టి విద్వాంసుడు . ఇంక ఆవిడ అవస్థ అర్ధం చేసుకోగలరను
కుంటా .
మా చుట్టాలబ్బాయి ఒకడు అమెరికా నుంచి మా
వూరు పెళ్లి చూపులకొచ్చాడు. పెళ్లికేం గాని, పెళ్లి చూపులకి పిల్లిని చంకన
బెట్టుకెళ్ళి నట్లు నాలుగేళ్ల మాబుడంకాయ్ ని తీసుకెళ్ళారు మా అమ్మా నాన్నా. కాఫీల తో పాటూ జంతికలు , మిక్ష్చర్ , స్వీటు లాంటి ఫలహారాలు
రాగానే కీచు గొంతుతో ‘ఇవి ఇంట్లో చేసినవేనా?’ అని అడిగాడట మా బుల్లిహీరో. పైకి
అందరూ నవ్వినా, ‘నయం! ఇవన్నీ పెళ్లి కూతురు చేసినవేనా? అని అడగలేదు ‘ అని అనుకున్నారంతా. ఆ
సంబంధం కుదరకపోవడంలో వీడి పాత్ర కూడా వుంద నుకుంటాం మేమిప్పటికీ .
ఇలా తలుచుకుంటూ వుంటే ఏ పిల్లల పసితనం అయినా ఒక అద్భుత అధ్యాయం. ఎప్పటికీ వాళ్ళు అలాగే వుంటే
ఎంత బావుణ్ణు ! అనిపిస్తుంది కదూ?
మళ్ళీ కలుద్దాం!
chala funny ga undi.
ReplyDeletechala funny ga undi.
ReplyDeletePillala chinnappati matale vallu pedda ayyaka manaki teepi gynapakalu
ReplyDeleteVery Hilarious!! I Enjoyed every bit and I was imagining you enjoying live with ur little one in action!!
ReplyDeletei missed all these.
ReplyDelete