బ్లాగాయనమః
ఈమధ్య నన్ను
ఒకరు ‘బ్లాగుష ‘ అని సంబోధించారు,
ఒకరేమో నా ‘బ్లాగాభిమాని ‘ అట . వీళ్లి ద్దరికీ వీర తాడు వేయ్యోద్దూ మరి! మాయాబజార్ లో ఘటోత్కచుడు
అన్నట్లు, ఎవరూ కనిపెట్టక పోతే
కొత్త పదాలు ఎలా పుడతాయి ? అవునంటారా? కాదంటారా?
సాధారణంగా షాపింగ్ అనగానే ఆడవాళ్ళకు అత్యంత ప్రియమైన 'వ్యాపకం ’ లేదా ‘వ్యసనం’ అని మనము తెల్చేస్తుం టాము . కానీ అస్తమానం
ఆడవాళ్ళనే అనడం తప్పండీ. ఇలా ఎందుకు అంటున్నానో మా శ్రీవారి షాపింగ్ ముచ్చ ట్లు చవి చూస్తే మీకే తెలుస్తుంది .
షాపింగ్ అంటే శ్రీవారికి మహా
ఇష్టం. అరవై నాలుగు కళలలో షాపింగ్ ఓ ‘కళ’ అనుకుంటే అందులో ‘కళా తపస్వి’ బిరుదుకు అర్హులు మా వారు. ఆఫీసు పని రిత్యా బోలెడు కొత్త ప్రదేశాలు తిరిగే ఆయనకు, తన కళ
కు మెరుగులు దిద్దే అవకాశం తరచూ వస్తూంటుంది.
కాశ్మీరు నుంచి కుంకం పువ్వు , టీ పొడి, ఇంక అదేదో ‘కావా’ అనే పానీయం చేసుకునే గుండ ,
అస్సాం నుంచి కూడా టీ పొడి, 'నల్ల' బియ్యం ( మీరు సరిగ్గానే చదివారు, ఆ బియ్యంతో కూడా పాయసం చేస్తారుట ) ఇంక ‘భూత్ ఝలోకా ‘ (మన భాషలో ‘దెయ్యం దెబ్బ’ లేక ‘గూబ గుయ్’ అనొచ్చేమో !) అని పిలువబడే ఎండు మిర్చి (వీటిని బాంబుల తయారీలో వాడుతారట ! ...అవాక్కయ్యారా?).
కేరళ నుంచి మసాలా దినుసులు, గోవా నుంచి కూడా ఎండు మిర్చి, నై నితాల్ నుంచి సంచు లు , ఒరిస్సా నుంచి స్వీట్లు .
వీటన్నిటినీ మించి ఆయా ప్రదేశాల ‘మేటి వస్త్రశ్రేణి ‘ -లింగ వివక్ష లేకుండా బట్ట లు, దుప్పట్లు, తువాళ్ళు, రు మా ళ్ళు ఒకటేమిటి రకానికి ఒకటయినా ఆయన కొనాల్సిందే . కాశీ వెళ్ళినప్పుడ యితే, ఏకంగా బనారస్ చేనేత మగ్గాల దగ్గరకి వెళ్లి మరీ పర్సు బరువు తగ్గించుకున్నారంటే ఇహ ఆలోచించండి.

ఆయన
‘టెష్టు' అనగా ఎంపిక బహు గొప్పదనే వార్త నాలుగు దిక్కులా వ్యాపించేసింది. ఇది
మటుకూ సత్యం సుమండీ! నా ‘చీరల కలక్షన్ ’ కి దెశ విదేశాలలో
ఫాన్స్ వున్నారండో య్ . ఆయన్ని తమతో షాపింగ్ కి వెంట రమ్మనే వారు కొందరయితే, 'ఈసారి మీరు ఎక్కడికెళ్ళినా మాకూ ఏమనుకోకుండా ఏదయినా తెచ్చిపెట్టండి ' అనేవారు కొందరు. దాంతో ఇక చెప్పేదేముంది, తర-తమ అనే బేధం లేకుండా , కార్డులు గోకుతూ మరీ స్వైరవిహారం
చేస్తూంటారు మా సారువారు .
ఎప్పుడో గానీ ఆయనతో షాపింగుకి వెళ్ళడానికి సాహసించను నేను. అందులోనూ బట్టల షాపింగ్ కి అయితే అడగొద్దు మరి.
దీనికీ కారణం లేకపోలేదు. ఆస్వాదించం డి !
ఇదివరకూ దుకాణాలలో , ఒక కౌంటరు , దాని వెనుక సేల్స్ మాన్ మనకి కావలసినవి
ఎంచక్కా ఓర్పుగా నేర్పుగా చూపించి అమ్మేవాడు. మనం కూర్చోవడానికి కావలసినన్ని కుర్చీలు ఉండేవి . కానీ ఇప్పటి మాల్స్ లో కౌంటర్లు బిల్లు ల
వరకే పరిమితం. ‘నిను వీడని నీడను నేనే' అంటూ మన చుట్టూ ప్రదక్షణం చేస్తూ వుంటారు సేల్స్ మెన్ . కొన్ని చోట్ల అయితే సీసీ కెమెరాల ధర్మమా అని మనల్ని వంటరిగా వదిలేసి , ‘హలో ఎవరక్కడ!’ అని మనం దాదాపు
అరిస్తే గానీ ప్రత్యక్షమవ రు సేల్స్ మెన్ . కుర్చీల్లాంటివి ఎక్కడో గానీ కనపడవుగా.
నిండా నిలువు జీవితమే . ఎటునుంచి లోపలికివెళ్తామో, ఎలా బయటకి వస్తామో అంతా, ఆగమ్యగోచరం.
ఇలాంటి ‘మయసభ’ల్లాంటి మాల్స్ లో
తనకి కావలసినదాని కోసం చుట్టూ చూస్తూ, వెదుకుతూ పద్మవ్యూహం లా అమ ర్చ బడిన ‘డిస్ప్లే ర్యాకు’ల మధ్య అంటే ‘అలమర ‘ల మధ్య శ్రీవారి ‘పాద యాత్ర ‘కి అంతు లేదు . ఆయన వెనకే
చేతుల మీద కనీసం పది రకాల
సెలెక్టెడ్ ఐటమ్స్ తో కాళ్ళీడుస్తూ
నీరసంగా, నడుస్తున్న ‘స్టా ట్యూ ఆఫ్ లిబర్టీ ‘ ని తలపిస్తూ పాపం నేను . పైగా ఒకవేళ అడుగున వు న్న అరల్లో ఆయనకి కావలసిన సైజో, మో డ లో , డిజైనో, రంగో ఉందేమో అన్న అనుమానం కలిగిందా, అంతే! నిర్మొహమాటంగా
గొంతికల్లా కూర్చుని మరీ అన్వేషణ సాగిస్తా రు.
ఇది ఆయన సూక్ష్మ సెలక్షన్ కు నిదర్శనం .
‘క్షణక్షణం’ లో బ్రహ్మానందం గుర్తున్నాడా? మొన్నీమధ్య
అచ్చు అలాంటి సేల్స్ మాన్
ఒక డు తారస పడ్డాడు మాకు . మావారిని చూస్తే నెమో
నిలువెత్తు గాంభీర్యం , వాడేం చెయ గలడు పాపం . అర్భకుడు! అయినా ప్రయత్నించాడు .
‘సార్ ! నేను చూపిస్తాను సార్ ‘, అంటూ ముందుకొచ్చాడు.
‘సార్ ! నేను ఆల్రెడీ
అక్కడ వెదికాను సార్’ , అంటూ వాదించాడు .
‘సార్! మీరు అడిగినది
స్టాకు లో లేదేమో సార్ ‘, అంటూ సంజాయిషీ చెప్పాడు .
‘సార్ ! నన్ను చూపించమంటారా సార్ ?‘అంటూ ప్రాధేయపడ్డాడు .
‘సార్ ! ఇది ఇంకా బావుంది చూడండి సార్ ‘ అంటూ సలహా ఇవ్వబోయాడు .
ఇలా శత విధాల
ప్రయత్నించి చివరకి కుక్కిన పేనులా జాలిగా నా వైపు చూసాడు ‘ఈయనెప్పుడూ ఇంతేనా మేడం ‘ అనే లుక్కిచ్చి . నేను
అంతకంటే జాలి మొహం పెట్టి నిర్లిప్తంగా
, నిస్సహాయంగా బిల్లు కట్టబోయే సగటు సాధారణ
‘భర్త’ లా గ ఒక మూల నిలబడ్డా .
ఒసారయితే ఈయన ఫ్రెండ్ ఒకరు షాపు లో కలిసి ‘సార్ ! మేడం గారికి ఎనర్జీ
డ్రింకు లాంటిది ఎదైయినా ఇప్పించండి ‘ అని ఉచిత సలహా
పారేసాడు నా అవస్థ చూసి.
అన్నింటినీ మించి ‘పొరుగింటి
మీనాక్షమ్మను చూసారా? వాళ్ల ఆయన చేసే
ముద్దూ ముచ్చట విన్నారా ? ‘ అనే పాత పాట గుర్తు తెచ్చుకుని మరీ మా బంధువర్గం లోని చాలా మంది స్త్రీలు తమ తమ భర్తలని మా వారిలా షాపింగ్ చేయరని ‘మీరూ వున్నారు ఎందుకూ? దేనికైనా సరదా వుండాలి ‘ అంటూ దెప్పుతూ వుంటారు . సుబ్బి పెళ్లి వెంకి చావుకి
రావడం అంటే ఇదేనేమో !
అన్నట్లు , ఈరోజు నేను మీతో
చెప్పినవన్నీ వుత్త మాటలే సుమండీ ! అన్నీ
బుర్రలోంచి తుడిచేయండి . ఏమిటీ
ట్విస్ట్ అనుకుంటున్నారా? భలేవారే! మళ్ళీ
మా 'షాపింగ్ కింగ్ ' ఏదైనా కేంపు కి గనుక వెళితే నాకోసం ఏమైనా తేవాలికదామరి ? ......అర్ధం చేసుకోరూ !
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
కొత్త సంవత్సరంలో కలుద్దాం !
Blogusha!Mdon!..👍👍👍
ReplyDeleteEnjoyed ur shopping spree!
ReplyDeleteUsually, we hear n experience the other way round!!
Super😊😊😊😊
ReplyDeleteSuper😊😊😊😊
ReplyDeleteMeeru raasina ee mudu,mudu aanimuthyalu ayithe muditilo kanipinchedi mee annyonyata,
ReplyDeleteBharya bhartala bhandalu teegalaga maarutumna ee rojulalo mee ee dampatyam aa darshame,
Nenu mundu comment raasaka baga aalochimcha eppati kaalamanam prakaram meere correct anipinchimdi,
Endukamte oka bhakti kadalu raste chadivevaru leni kaalam edi,
Elanti kaalam lo okka manchini meedayina reeti lo chupistumnaru,
Dhaampatya maaduryamni chupistumnaru,
Kaasi majali kadalu vinna ee chevulu modatlo vaividhyanni aasvadimcha lekapoyanemo,
Telugu thanam lo imidi poyina bhasha eekalam lo arudhu,alanti mee ee rachana adbutam,
Nava rasala lo haasyam oka rasam,
Aa rasaani meedayina reeti lo atyadbhutam ga pandimcharu,
Chinna chinna cheloktulato,
Andamga saage ee jeevithanni adam la chupincharu,
Aadavari maatalaku ardhale verule anna maatalu nijamemo anipistumdi,
Adbutum bagumdi,..
Meeru raasina ee mudu,mudu aanimuthyalu ayithe muditilo kanipinchedi mee annyonyata,
ReplyDeleteBharya bhartala bhandalu teegalaga maarutumna ee rojulalo mee ee dampatyam aa darshame,
Nenu mundu comment raasaka baga aalochimcha eppati kaalamanam prakaram meere correct anipinchimdi,
Endukamte oka bhakti kadalu raste chadivevaru leni kaalam edi,
Elanti kaalam lo okka manchini meedayina reeti lo chupistumnaru,
Dhaampatya maaduryamni chupistumnaru,
Kaasi majali kadalu vinna ee chevulu modatlo vaividhyanni aasvadimcha lekapoyanemo,
Telugu thanam lo imidi poyina bhasha eekalam lo arudhu,alanti mee ee rachana adbutam,
Nava rasala lo haasyam oka rasam,
Aa rasaani meedayina reeti lo atyadbhutam ga pandimcharu,
Chinna chinna cheloktulato,
Andamga saage ee jeevithanni adam la chupincharu,
Aadavari maatalaku ardhale verule anna maatalu nijamemo anipistumdi,
Adbutum bagumdi,..
Evaraina cheera konukkovali me ayanni okasari pampivvamma ani adigara ��
ReplyDeleteMeevari. Selection thebest😃 ani vere Cheppalaaa. mari chodyam kakapote🤔...ninnu chuste teleedu.😊😊
ReplyDeleteహహ్హాహ్హాహ్హా .. ఉష గారు మీ వారి షాపింగ్ గురించి మీరు వివరించిన తీరు చాలా బాగుంది .. చివరి వరకు నిజమే అనుకున్నాను ఎందుకంటే కొంచెం నా షాపింగ్ అలవాట్ల లాగ అనిపించి "హమ్మయ్య నేనే కాదు ఇంకొంత మంది నా లాంటి వాళ్ళు ఉన్నారన్న మాట " అనుకుని ఖుష్ ఐపోయాను .. ఖుష్ అనే మాట వాడనిదే నాకు తోచదు .. పుట్టుక నుంచి తెలంగాణ ప్రాంతం లో ఉన్నందుకు కొంచెం ఇక్కడి సాయబుల భాష ప్రభావం నా మీద కూడా పడింది. అదన్నమాట సంగతి. మొత్తానికి అలా షాపింగ్ చేయమని ఒక సూచన ఇచ్చారన్నమాట .. బాగుంది .. ఇన్నాళ్లు ఇలాంటి బ్లాగ్ లు మిస్ అయినందుకు కొంత బాధగా ఉన్నా ఇన్నాళ్ళకైనా ఈ భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది ..
ReplyDelete