బ్లాగాయనమ:
సరదాగా అందరితో కబుర్లు
చెప్పాలనిపించింది. నన్ను ఆపకుండా, నా మాటలు మీరందరూ వినాలంటే కబుర్లు చెప్పడం కంటే రాయడం
బెటరనితో చింది.
కానీ చేత్తో 'పుస్తకాలు' చదివే తీరిక లు, ఓపికలు బాగా తగ్గాయి కాబట్టి ‘బ్లాగే బహు బాగు ‘అని ఫిక్సయ్యా!.
ముందుమాట గా అక్షరం నేర్పిన అమ్మకి, సదా
స్ఫూ ర్తి నిచ్చిన నాన్నమ్మకి , వెన్ను తట్టి ప్రోత్సహించే నా
మెంటార్ వసుధ గారికి, ప్రేరణ గా నిలిచిన నేస్తం ప్రశాంతికి బోలెడు కృత జ్ఞత లు.
ఇంతకీ ఈ రోజు ఏమిటి ప్రత్యేకం అంటే.. నేను పంతుల వారింట మెట్టి నేటికి పంతొమ్మిది ఏళ్ళు పూర్తయ్యాయి .
అనగా ‘మాధ వాయస్వాహా ‘అని ఔపోసన పడుతూ దాదాపు రెండు
దశాబ్దాలు కావొస్తోంది.
నా బాణీ లో మా జంట ని మీ అందరికీ పరిచయం
చేస్తాను. (ఎదో మీ ఎవ్వరికీ పెద్ద తెలీనట్టు)
ఆయన ‘మిత భాషి’, నేనేమో ‘అమిత భాషి’. అంటే ఎస్సే రాయమంటే ఒక పదం తో సరిపెడతారాయన,
ఖాళీ పూరించమంటే ఎస్సే రాస్తాను నేను.
ఇప్పటికీ ఆయన నోటి ముత్యాలు సరిపడినన్ని
జారక, నా ముత్యాలహారం చేయించు
కోవాలనే కోరిక వాయిదా పడుతూనే వుందంటే
నమ్మండి.
ఆయనది చిరుమందహాసం, నాదేమో అట్టహాసమ్. కామెడీ సినిమాని కూడా చాలా సీరియస్సుగా
తీసుకుంటా రాయన, సెంటిమెంటు సినిమా మీద జోకులేస్తాను నేను.
క్రికెట్టు మ్యాచు విన్నింగ్ మూమెంట్ల
ని సైతం 'అచంచలంగా' తిలకించే 'స్థిత ప్రజ్ఞత' ఆయనది.
గెలుపు-ఓటమి నిమిత్తం లేకుండా,ప్రతీ బంతికి కెవ్వు కేక , గావు
కేక పెట్టే 'చంచలత్వం' నాది.
ఆయనదేమో అనౌంన్సుమెంటుని కూడా చెవిలో రహస్యంగా
చెప్పే గుట్టు, నాదే మో రహస్యాన్ని కూడా
బహిరంగంగా వె ల్లడించే రట్టు .
ఆయన కి కుటుంబమే ప్రపంచమయితే,
నాకేమో జగమంతా జట్టే.
ఆయన కు ఇల్లే స్వర్గం. నాకేమో ఇరుగూ
పొరుగూ కూడా మెరుగే మరి.
ఆయనకి ఆరు నూరయినా, నూరు ఆరైనా, ససేమిరా కుదరదు. నాకేమో ఆరు నూరయితే, నూరు ఆరయినట్టే! (మాయా శశిరేఖ గుర్తొచ్చిందా?). పెద్దగా పట్టించు కొను .
ముందూ –వెనుకా, మంచీ -చెడూ అన్నీ ఆచి తూచి చాలా తీవ్రంగా అలోచించి గానీ అడుగు వెయ్యరాయన .
మరేమో,ఒక్క ఉదుటన క్షణంలో ముందుకి దూకేసే హడావిడి నాది.
‘ఏమం డో య్ ! ఏడు జన్మల బంధం అంటారు కదా! ‘ అని నేనం టే , ‘మరే, ఖచ్చి తంగా ఇది మన ఎడో జన్మే !’ అంటూ చల్లగా తేల్చి
చెప్పే చతురత అప్పుడప్పుడు తళుక్కు మంటుంది. నిజ్జంగా!
ఏదయితేనేం, స్వర్ణ కమలం లో మన భాను ప్రియ చెప్పినట్లు , గంత కు తగ్గ బొంతలాగ,
ఆయన వేణు నాదమంత మధురమయితే , నేను హు షారంత
ఉషస్సునయి సంసార సాగరం జోరుగా ఈదేస్తున్నాం. ఇలాగే కలకాలం ఉండడానికి మీ అందరి అభినందనలు,
ఆశీస్సు లు ఎల్లప్పుడూ కావాలి సుమండీ.. .
మరి వుంటా
మళ్ళీ కలుద్దాం!
అద్భుతః
ReplyDeleteParama adbhutaha. Vivaha Dina subhakanshalu and subhaaseessulu mee iddariki. Wish you both many more years of happy time together.
ReplyDeleteHi usha
ReplyDeleteTakkaridonga Chakkanichukkalaku Subhambhuyat. Jeevanasravanthilo Ushadayamto prambhinchi Venumadhavam cherute kavalsindi. Santhosham! Subhodayam!
ReplyDeleteమన శక్తిని తెలియజేసేది మన సామర్ధ్యం,
ReplyDeleteమనమేం చేయగలమో తెలిపేది మన ప్రేరణ,
మనమేంటో నిర్ణయించేది మన వ్యక్తిత్వం
This is for you and madhu..God bless you both
Super usha... Maatalatho muripinchav..u both are such a loving n balanced couple... Party eppido cheppu first.. Appudu aasu kavitvam cheppali mari... Mee iddariki na blessings...
ReplyDeleteSuper usha... Maatalatho muripinchav..u both are such a loving n balanced couple... Party eppido cheppu first.. Appudu aasu kavitvam cheppali mari... Mee iddariki na blessings...
ReplyDeleteChalaa baaundi ushakka :)
ReplyDeleteSuper
ReplyDeleteUsha super.God bless you two ... Continue in the same way
ReplyDelete..all the best
This comment has been removed by the author.
ReplyDeleteSuperb...
ReplyDeleteమీకు మరొక్క సారి వివాహమహోత్సవ శుభాకాంక్షలు. ఉషోదయం లో వేణు నాదం అఖిల లోకాలకు ఎంతో మధురం. మధు బుజ్జి మితభాషి మాత్రమే కాదు హితభాషి.. అయినా నీతో పెళ్లయిన దగ్గర నుండి వాడు ఉష్ గప్ చుప్..నువ్వు ఒప్పుకోకపోయినా ! మొత్తానికి చాలా బాగా రాసావు. అభినందనలు.
ReplyDelete-దీవెనలతో బావగారు.
This comment has been removed by the author.
ReplyDeleteMatale anukunna, rathalinkaa padunu
ReplyDeleteBelated Anniversary to both of u...
ReplyDeleteBoth of u..A match cannot be more perfect!
But would like to listen to Madhu's opinions and comments on this...
Love to both of u.
Very interesting Ushaji!! Wish u both many many happy years of togetherness!
ReplyDelete~Varalaxmi
Mumduga Pelli roju subhakankshalu,
ReplyDeleteBaarya bartha lani neeru paala to polustaru indukane nemo,...
Ma Amma ade mee Chittattha Ushakka chinnappudu ani kaburlu chepthunte ento anukunnanu ushakka.. Nijanga gala galaaa matladatame kaadu raasesthunnavu kuda.. Chaaala Chaala bavundi Nee blogu.. Chinnappudu Telugu Kathala pusthakaalu, Doordarshan teleschool lo vache kathalu chadi(vinattu) undi :) All the very best!
ReplyDeleteInthakee nenevaro cheppaledu... Nenu Divya ni.. Chittattha kuthuru..
ReplyDeleteNice write-up
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSo nice usha aunty
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteచాలా బాగుంది ఉషా, నీ బ్లాగు.
ReplyDeleteప్రాణం లేచొచ్చింది నీ తెలుగు చదివి!!
మధురం గా ఇలాగే చిర కాలం నీ బ్లాగు సాగాలని ఆశీర్వదిస్తూ,
వాగ్దేవి